విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ
– స్వయంకృషి స్వచ్చంధ సేవా సంస్థ, ఇంపాక్ట్ ఫౌండేషన్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : స్వయంకృషి స్వచ్చంధ సేవా సంస్థ, ఇంపాక్ట్ ఫౌండేషన్ అధ్వర్యంలో విద్యా ర్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండ లంలోని ఏ వీ ఎస్ ఫంక్షన్ హాల్ లో కాటారం మండల కేంద్రం లోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతుల గ్రామీణ విద్యార్థిని విద్యార్థులకు స్వయంకృషి స్వచ్చంధ సేవా సంస్థ కాటారం వారి సహకారంతో ఇంపాక్ట్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి అధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లా డుతూ విద్యార్థులు చదువు అంటే కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలని, క్రమశిక్షణతో మెలగాలని, ప్రతి ఒక్క విద్యార్థి తమ జీవిత ఆశయాన్ని ఎంచుకొని, ఆ గమ్యాన్ని చేరుకునే వరకు నిరంతరం శ్రమించి ఉన్నత శిఖరాలను అధిరోహిం చాలని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకి, పుట్టిన ఊరికి, విద్య నేర్పించిన గురువులకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, వ్యవసాయ అధికారి రామకృష్ణ వారి విద్యాభ్యాసం, ఉద్యోగం సాధించే వరకు కష్టపడిన తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో స్వయంకృషి స్వచ్చంధ సేవా సంస్థ ఫౌండర్ కొట్టే సతీష్, ఇంపాక్ట్ ఫౌండేషన్ వక్తలు డాక్టర్ శ్రీకాంత్, రామ్ కమల్ , శ్రీనివాస్ బాపూజీ , జాడి శ్రీశైలం , సదానంద్ మురారి, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ బృందం, స్వయం కృషి సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.