వెంకటాపురం సీఐ రమేష్ ను కలిసిన పెరికసంఘం నాయకులు
వెంకటాపురం, జూలై31, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం సీఐగా పదవి బాధ్యతలను చేపట్టిన ముత్యం రమేష్ ను గురువారం నూగూరు వెంకటాపురం పెరిక సంఘం నాయకులు మర్యాధ పూర్వకంగా కలిసి, పట్టు శాలవ తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెరిక కుల పెద్దలు పల్నాటి నాగేశ్వరరావు, చిడెం సాంబశివరావు, పల్నాటి ప్రకాష్ రావు, క్యాప నరసింహారావు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.