జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా పవిత్రం శ్రీనివాస్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా కాటారం గ్రామానికి చెందిన పవిత్రం శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భూపాలపల్లి వాసవి మాత దేవాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రక్రియలో జిల్లా అధ్యక్ష పదవికి పవిత్రం శ్రీనివాస్, మహదేవపూర్ నుండి శివనాత్రి ప్రదీప్ కుమార్ ఇద్దరు నామినేషన్ వేశారు. నిబంధనల మేరకు శివనాత్రి ప్రదీప్ కుమార్ నామినేషన్ లేకపోవడంతో స్కూటీనీలో తిరస్కరణకు గురైందని అధ్యక్షులుగా పవిత్రం శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిటీ కన్వీనర్ వంగేటి అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం నుండి నూతన అధ్యక్షుడు పవిత్రం శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టినట్లు ప్రకటించారు. పూర్తిస్థాయి కార్యవర్గాన్ని త్వరలోనే అన్ని మండలాలకు ప్రాతినిధ్యం వహించేలా విస్తరించాలని తెలిపారు. అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పవిత్రం శ్రీనివాస్ మాట్లాడుతూ వైశ్య సోదరుల ఆకాంక్షల మేరకు వినమ్రతతో సంఘం అభివృద్ధికి పనిచేస్తానని అన్నారు. ఎన్నికకు సహకరించిన జిల్లాలోని వైశ్య సంఘం మండల శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు శిరుప అనిల్, మహాసభ జిల్లా అధ్యక్షులు ఐతు రమేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పవిత్రం శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావడం పట్ల కాటారం మండల ఆర్యవైశ్యులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని మండల శాఖ అధ్యక్షులు, వైశ్య సంఘాల నాయకులు నూతన అధ్యక్షుడు పవిత్రం శ్రీనివాసు ను పూల మాలలు వేసి, బోకెలు ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరిం చారు. సజావుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన నాయకు లకు పవిత్రం శ్రీనివాస్ శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమ శాంత కుమార్, ఎం ఎల్ ఎన్ మూర్తి, మడూరి ముక్తేశ్వర్, అనంతుల శ్రీనివాస్, కముటాల రవీందర్, బచ్చు ప్రకాష్, మద్ది నవీన్ కుమార్, మద్ది సూర్యనారాయణ, కలికోట దేవేందర్, కలికోట వరప్రసాద్, సిరిపురం శ్రీమాన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.