టు ఏ భూములకు హక్కు పత్రాలు మంజూరు చేయాలి

టు ఏ భూములకు హక్కు పత్రాలు మంజూరు చేయాలి

టు ఏ భూములకు హక్కు పత్రాలు మంజూరు చేయాలి

వెంకటాపురం, జులై 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం మాల మహానాడు మండల కమిటీ సమావేశం గురువారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణ లో నిర్వహించారు. మండల అధ్యక్షుడు మంచాల భూషణం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షుడు సాధనపల్లి చిట్టిబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులతో సమానంగా సహజీవనం గడుపుతూ మా తాతల తండ్రులు సంపాదించిన భూములకు (టూ ఏ భూములకు) భూభారతిలో దరఖాస్తు చేసుకున్న వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అంబేద్కర్ అభయహస్తం కొనసాగించాలని కోరారు. ప్రభుత్వ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈసమావేశంలో పాల్గొన్న  సాధనపల్లి పెద్ద శ్రీనివాస రావు, పొంది భరత్ కళ్యాణ్,మాల మహానాడు మండల సెక్రెటరీలకు మల్ల మోహన్, యన్నమల్ల ప్రణీత్,శెట్టి పెళ్లి లక్ష్మీ నారాయణ, కాలువ సుందర్రావు రిటైర్డ్ టీచర్, యన్నమల్ల నారాయణమూర్తి, కాట మహేష్, గుండమల్ల కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment