ఆర్ఓఆర్ చట్టం ఆమోదం ఆదివాసీలకు చీకటి రోజు 

ఆర్ఓఆర్ చట్టం ఆమోదం ఆదివాసీలకు చీకటి రోజు 

ఆర్ఓఆర్ చట్టం ఆమోదం ఆదివాసీలకు చీకటి రోజు 

– ఎల్ టి ఆర్ చట్టాన్ని బొంద పెట్టిన సర్కార్

– జి ఎస్పీ దీక్షకు మద్దతు ప్రకటించిన ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి

– ఎల్ టి ఆర్ చట్ట విధ్వంస కారిగా నూతన ఆర్వో ఆర్ చట్టం..

    వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : షెడ్యూల్డ్ చట్టాలపై ఉక్కు పాదం మోపుతూ ఆదివాసీల భూమి హక్కును కాల రాస్తూ ఉన్న ప్రభుత్వం పైన ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి మండిపడ్డారు. జీఎస్పీ ఆధ్వర్యంలో పూనెం సాయి చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బుదవారం నర్సింహామూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం బుధవారం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన బిల్లు గిరిజనుల అస్థిత్వాన్ని బొంద పెట్టే విధంగా ఉందని అన్నారు. 2020 లో కేసీఆర్ తెచ్చిన భూ చట్టాన్ని షెడ్యూల్డ్ ఏరియాలో యదాతదంగా కొనసాగిస్తూ ఉన్నారని ధ్వజం ఎత్తారు. ఆనాడు ఎల్ టి ఆర్ చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనేతరులకు ఇచ్చిన భూమి హక్కులకు కొనసాగింపు గా రైట్స్ ఆఫ్ రికార్డ్స్ చట్టం ఉందన్నారు. కెసిఆర్ నియంతృత్వ వారసత్వ విధానాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులంత కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారని తెలిపారు. కానీ ప్రబుత్వం గిరిజనులకు వెన్నుపోటు పొడిశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన భూ చట్టం లో గ్రామ కంఠ భూములకు, అక్రమంగా గిరిజనేతరుల సాగులో భూములకు హక్కులు షెడ్యూల్ ఏరియాలో కల్పించడం అంటే గిరిజనులను నయ వంచన చేయడమే అన్నారు. ఈ బిల్లు, అప్పీల్ మరియు రివిజన్ అధికారుల ద్వారా విచారణల కోసం 1908 సివిల్ ప్రొసీజర్ కోడ్ నుండి నిబంధనలను వర్తింపజేస్తుంది. అయితే షెడ్యూల్డ్ ప్రాంతాలకు సి.పి.సి. వర్తించదు, ఇక్కడ సివిల్ వివాద విచారణ కోసం ఏజెన్సీ రూల్స్, 1924 అమలులో ఉన్నాయని తెలియజేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ప్రవేశ పెట్టిన ఆర్ఓఆర్ చట్టం బిల్లును తక్షణమే ఉప సంహారించు కోవాలని డిమాండ్ చేశారు. కొమరం భీమ్ కాలని ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూమి పైన కుట్ర చేసి ఆడవాళ్ళ పైన అత్యంత పాశవికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ మహిళల పైన దాడి చేస్తే ఏ ఒక్క రాజకీయ పార్టీ అండగా నిలవలేదన్నారు. వలస గిరిజనేతరులకు, పదవులో ఇచ్చే రాజకీయకులు ఆదివాసీలను వలస వాదులు అనడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఆదివాసీలు ఈ దేశంలో ఎక్కడున్నా ఆదివాసీలే అన్నారు. సాగులో ఉన్న భూములను గుంజుకొని పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం లో గిరిజనేతరుల కుట్ర దాగి ఉందన్నారు. 145 సెక్షన్ తహసీల్దార్ పెట్టడం లో అంతర్యం ఏమిటన్నారు. గిరిజనేతరుల కబ్జాలో ఉన్న భూముల పైన 145 సెక్షన్ ఎందుకు పెట్టడం లేదో ఆది వాసీలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పూనెం సాయి చేస్తున్న దీక్షను భగ్నం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదన్నారు. కొమరం భీమ్ ఆదివాసీలు చేస్తున్న పోరాటం న్యాయమైనది అన్నారు. తహసీల్దార్ స్పందించి ఆదివాసీలకు న్యాయం చేయాలన్నారు. నాయకులు మహేష్, రవి, ప్రజలు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment