వెంకటాపురం జూనియర్ కళాశాలలో పేరెంట్స్ సమావేశం
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదేశానుసారం శుక్రవారం వెంకటా పురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధానాచార్యులు కె. విజయకుమార్ అధ్యక్షతన విద్యార్థులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశంలో రాబోయే పరీక్షల దృష్ట్యా 90 రోజుల ప్రణాళికను విద్యార్థులకు తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులతో కూడిన వాట్సప్ సమూహాన్ని ఏర్పాటు చేసి నిత్యం విద్యార్థుల చదు వుల వివరాలు గురించి ఈ మాధ్యమం ద్వారా చర్చించాలని ఆయన అన్నారు. ప్రారంభంలో కన్నా ప్రస్తుతం కళాశాలలో తరగతులలో అన్ని సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని విద్యా ర్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఇకనుండి కళాశాలలో వాజేడు కళాశాల ఉపన్యాసకులు రెగ్యులర్ తరగతులు తీసుకుంటూ విద్యార్థుల విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తా మన్నారు. ములుగు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో తొలి సారిగా ఈ కళాశాలలో ఈవిధంగా విద్యార్థులు తల్లితండ్రు లతో సమావేశం ఏర్పాటు చేయటం ఎంతో ఆనందంగా ఉంద ని విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తపరిచారు.ఈ కార్య క్రమంలో కళాశాల ఉపన్యాసకులు విద్యార్థులు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.