రెడ్డి గాండ్ల కుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి చిత్రపటానికి పాలభిషేకం.
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : రెడ్డి గాండ్ల కుల సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోనీ శ్రీపాద చౌక్ లో మంత్రి చిత్రపటానికి పాలభిషేకాన్ని నిర్వహించారు. కాంగ్రేస్ పార్టీ బలోపేతం కోసం, మంత్రి శ్రీధర్ బాబు గెలుపుకోసం, పార్టీ కార్యకర్తల కు అండగా ఉండి, అంచలంచలుగ పార్టీ లో వివిధ హోదాలో ఎదిగి, ఐటీ, పరిశ్రమల శాసనసభ వ్యవ హారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు శ్రీపాద ట్రస్ట్ చైర్మెన్ దుద్దిళ్ల శ్రీను బాబు ప్రోద్బలంతో తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా నియమితులయిన భూపాల పల్లి జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి కి మహాదేవపూర్ మండల కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శ్రీపాద చౌక్ లో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచి, పటకాలు పేల్చి పెద్దేతున్న సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం మండల అధ్యక్షులు అయిత రమేష్ రెడ్డి, కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్, బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు కోట రాజబాబు, పాక్స్ చైర్మన్ సల్ల తిరుపతి రెడ్డి, ఎంపీపీ రాణి బాయి రామారావు, జడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్, పలిమెల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు చిన్నాన్న,రాంమోహన్ రావు,సీనియర్ కాంగ్రేస్ పార్టీ నాయకులు వామన్ రావు, వెన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అయిత తిరుపతి రెడ్డి, పోటు మల్లారెడ్డి, సల్ల కేశవరెడ్డి,కోట సమ్మయ్య, ఓ బి సి మండల అధ్యక్షులు పోలు మొండయ్య,పాక్స్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి, ఆర్.ఎం.పి లా సంఘం నాయకులు దొడ్ల అశోక్,రమేష్ రెడ్డి, యూత్ నాయకులు కాడర్ల నాగరాజు,హరీష్, సురేందర్ రెడ్డి రంజిత్ రెడ్డి,ప్రణయ్, సమ్మయ్య,మాజీ ఉపసర్పంచ్ మోతే సాంబయ్య,మైనార్టీ నాయకులు ఎజాస్, నాయుమోద్దీన్, రాఫు,మోతే సమ్మయ్య, కృష్ణ మోహన్, సత్తిరెడ్డి,కుమ్మరి మల్లయ్య, శంకర్ మహిళా కాంగ్రేస్ పార్టీ నాయకురాలు పద్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.