జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ

Written by telangana jyothi

Published on:

జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ

– జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

తెలంగాణ జ్యోతి,  ములుగు ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నిక ల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు లో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ములుగు జిల్లా పరిదిలో కాపాడటం కోసం మరియు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలను నివారించడానికి, ప్రశాంత మైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడం కోసం,  లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా 11తేదీ సాయంత్రం 4.00 గంటల నుండి 14 తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు ములుగు జిల్లా వ్యాప్తంగా ఐదుగురు (5) కంటే ఎక్కువ మంది వ్యక్తుల సమావేశాన్ని నిషేధించడం జరిగిందని తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉన్న సమయం లో చట్టవిరుద్ధమైన సమావే శాలపై పూర్తి నిషేధం మరియు బహిరంగ సభల నిర్వహణపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ తెలిపారు.

Tj news

1 thought on “జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now