వేయి డప్పులు, లక్ష గొంతులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి: వెయ్యి గొంతులు, లక్ష డప్పులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిస్తూ ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద కుమార్, జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యామ్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుండి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో జరి గే 1000 గొంతులు లక్ష డప్పులు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేం దుకు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మంద క్రిష్ణ మాదిగ, బృహత్ ప్రణాళికతో కార్యక్రమాన్ని చేపట్టారని, మాదిగ సోదరులు, సోదరీ మణులులందరూ లక్షలాదిగా హైదరాబాద్ తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదంచేయాలని పిలుపు నిచ్చా రు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. వెయ్యి డప్పులు లక్ష గొంతులు కార్యక్రమం ఆవశ్యకతను రాష్ట్ర నాయకులు మందకుమార్, జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యామ్ కార్యకర్తలకు సుదీర్ఘంగా ప్రసంగిస్తూ అవగాహన కల్పిం చారు.ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి వావిలాల సాంబశివ రావు ,మండల అధ్యక్షులు తోకల శివ, సీనియర్ నాయకులు వేల్పుల మల్లేష్, రాష్ట్ర నాయకులు గుగ్గిల నరేందర్, సీనియర్ నాయకులు యాసం మహేష్, కోగిల మల్లికార్జున, నరేష్, పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.