ట్రాక్టర్ పై నుండి పడి ఒకరికి తీవ్ర గాయాలు
– ములుగు తరలింపు
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉఫ్ఫేడు గొల్లగూడెం గ్రామానికి చెందిన యాదళ్ళ దుర్గాప్రసాద్ ట్రాక్టర్ను డ్రైవింగ్ చేస్తూ గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు జారీ కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ట్రాక్టర్ టైర్ కాళ్ళ మీదుగా వెళ్లడంతో పాదాలు కాళ్లు చిథ్రమయ్యాయి. హుటా హుటిన వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు 108 అంబులెన్స్లో తరలించారు. డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 లో ఏటూరునాగారం సిఫారసు చేశారు. అక్కడినుంచి ములుగు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రునికి తీవ్రంగా రక్త స్రావం జరిగినట్లు సమాచారం. విష యం తెలిసిన వెంటనే ఉప్పెడు గొల్లగూడెం గ్రామస్తులంతా వెంకటాపురం ప్రభుత్వ హాస్ఫిటల్కు తరలివచ్చారు. ఈ ప్రమాద సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.