ములుగు జిల్లాలో ప్రెషర్ బాంబు పేలి ఒకరికి గాయాలు
ములుగుప్రతినిధి:ములుగు జిల్లా వెంకటాపురం మండలం చెలి మెల ముత్యందార అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు ఆదివారం పేలిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..వంట చెరుకు కోసం అడవిలోకి ముగ్గురు కలిసి వెళ్లారు. వెళ్ళిన ముగ్గురిలో అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ ముత్యం ద్వారా అడవి ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు వేయగా ఎడమ కాలు నుజ్జు నుజ్జయ్యింది. తోటి వారు స్థానికుల సహాయంతో వెంటనే అంబులెన్స్ లో ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ములుగు తరలించ నున్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.