గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి గాయాలు.
ములుగు, తెలంగాణ జ్యోతి : మేడారం జాతర జంపన్న వాగు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మేడారం తలలో దర్శనానికి వచ్చిన ఎరుపుల శరత్ జంపన్న వాగు సమీపంలో రహదారిపై నడుస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 కు సమాచారం అందించగా హుటా హుటిన అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఈఎంటి మహబూబ్ నాయక్ ప్రథమ చికిత్స అందించగా పైలట్ తిరుపతి ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.