పురుగు మందు తాగి ఒకరి ఆత్మహత్య
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన మునిగల శ్రీనివాస్ (55) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటా పురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు కథనం ప్రకారం… వీరభద్రారం గ్రామపంచాయతీ లో వర్కర్ గా పనిచేస్తూ జీవనం కొనసా గిస్తున్న మునగల శ్రీనివాసరావు సోమవారం మధ్యాహ్నం సమయంలో పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆస్ఫిత్రికి తరలించగా మృతి చెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. తిరుపతి రావు విలేకరులకు తెలిపారు.