అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రాహుల్ శర్మ.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : కాళేశ్వరం గోదావరి ఎగువ ప్రాంతాలలో గల అన్ని బ్యారేజీలన్ని గేట్లు ఎత్తడంతో కాలేశ్వరం గోదావరి మెయిన్ గాటు వద్ద వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేసారు. గోదావరి మెయిన్ గాట్ వద్ద గల షాప్ యజమానులకు వరద ఉధృతి పెరుగుతూ ఉన్నందున సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అదేవిధంగా పూసుకుపల్లి గ్రామం వరద ఉధృతికి ఎక్కువ అయితే ముంపు అయ్యే అవకాశం కలదు కావున అక్కడి ప్రజలు రిహా బిలిటేషన్ సెంటర్కు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని తెలిపి అధికారులకు తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ (డిఎల్పిఓ) వీరభద్రయ్య, ఎంపీడీవో వెంకటే శ్వర్లు, తహసిల్దార్ రాథోడ్ ప్రహ్లాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రా మచంద్రరావు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చక్రపాణి, ఇరిగే షన్ డిప్యూటీ ఇంజనీర్ సూర్య ప్రకాష్ పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ సిడబ్ల్యుసి సైట్ ఇంజనీర్ శ్రీకాంత్ తదిత రులు వెంట ఉన్నారు.