మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాటారం మండలం గంగారం గ్రామ పంచాయతీలో ఉన్న మోడల్ స్కూల్ 2024-25 విద్యా సంవత్స రానికి నోటిఫికేషన్ విడుదల అయిందని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బి మధు గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి లో 100 సీట్లకు గాను, 7, 8,9,10 వ తరగతిలలో మిగిలిన సీట్లకు గాను ఆన్లైన్ ద్వారా ఈనెల 12 నుంచి ఫిబ్రవరి 22వ వరకు దరఖాస్తు చేసు కోవాలని కోరారు. పరీక్ష ఫీజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు రు.125, మిగతావారు 200 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్ ఏడవ తేదీన పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని విద్యార్థులు అందరూ ఫిబ్రవరి 22 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరని ప్రిన్సిపాల్ మధు కోరారు.