అసాంఘిక శక్తులకు ఎవరు సహకరించవద్దు 

అసాంఘిక శక్తులకు ఎవరు సహకరించవద్దు 

– పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ నిషేధిత మావోయిస్టులకు ఎవరు సహకరించవద్దని ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి. కృష్ణ ప్రసాద్ కోరారు. మంగళవారం పేరూరు పి.ఎస్ పరిధి లోని పోలీస్ రికార్డుల ప్రకారం గతంలో మావోయిస్టులకు సహకరించిన వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి వారికి కౌన్సి లింగ్ నిర్వహించారు. గతంలో తెలుసో తెలియకో సహకరిం చారని, ఇకముందు ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ఏమైనా ప్రజా సమస్యలు ఉంటే ఆయా ప్రభుత్వ శాఖలకు పోలీస్ శాఖ ద్వారా తెలియపరచి పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ఇకపై ఎవరు కూడా అసాం ఘిక శక్తుల మాయమాటలు తో వారి వలలో పడరాదని ఈ సందర్భంగా సుదీర్ఘంగా ఎస్.ఐ. కౌన్సిలింగ్ నిర్వహించారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment