మావోయిస్టులకు ఎవరు భయపడవద్దు
- నిర్భయంగా ఓటు వేయండి మీకు భద్రతగా మేముంటాం
- జిల్లా ఎస్ పి గౌష్ ఆలం ఐ పి ఎస్
వెంకటాపురం ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పరిధిలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున ఓటు వేయడానికి ఎవరు భయపడవద్దని మీ అందరికీ పోలీసు బలగాలు తోడుగా ఉంటాయని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించు కొని మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో తమ పాత్ర పోషించాలని జిల్లా ఎస్ పి గౌష్ ఆలం అన్నారు. ప్రధాన కూడళ్ళు రహదారుల వెంబడి వాడ వాడ తిరుగుతూ ప్రజలలో ఎన్నికల పట్ల విశ్వాసాన్ని పెంపొందించే దిశగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరి శెట్టి సంకీర్త్ ఐ పి ఎస్, సి ఐ వెంకటాపురం కుమార్, ఎస్ ఐ వెంకటాపురం అశోక్, ఎస్ ఐ తిరుపతి రావు, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
1 thought on “మావోయిస్టులకు ఎవరు భయపడవద్దు”