మండల బిజెపి నూతన కార్యవర్గం ఏర్పాటు
కాటారం, ఆగస్ట్ 20, తెలంగాణ జ్యోతి : కాటారం మండల కేంద్రంలో బుధవారం ఐదు మండలాల బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిలు గా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, చల్ల నారాయణ రెడ్డి లు పాల్గొన్నారు. కాటారం మండల్ బీజేపీ నూతన కార్యవర్గని ప్రకటించారు. మండల అధ్యక్షులు గా పాగె రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులుగా, తోడే వీర రెడ్డి, గంట అంకయ్య, చీర్ల బాపురెడ్డి, చీర్ల అశోక్ రెడ్డి, పర్తి రెడ్డి హన్మయ్య, ఇజమూరి సాధనందం, మండల ప్రధాన కార్యదర్శులు గా ఆత్మకూరి స్వామి యాదవ్, గోగుల రాజేష్, మంత్రి సునీల్, బొంతల రవీందర్, ముదిరాజ్, కార్యదర్శులు గా, పెంట మధు, బండి రమేష్, బొడ్డు శివ, గండు మల్లారెడ్డి, ముద్రకోళ్ల సుధాకర్,గాలి సారయ్య లను పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డి ప్రకటించారు. కోశాధికారి గా తోడే శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా గండు తిరుపతి, ఎస్సీ మోర్చా వేముల లింగయ్య, చందుపట్ల సునీల్ రెడ్డి, చల్ల నారాయణ రెడ్డి నియమించారు. ఈ కార్యక్రమం లో మహాముత్తారం, మహాదేవపూర్, మలహార్ మండలాల అధ్యక్షులు, పూర్ణ చందర్, మనోజ్, శ్రీకాంత్,దుర్గం తిరుపతి, బండం మల్లారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.