బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం
ములుగు, డిసెంబర్22, తెలంగాణ జ్యోతి : జాతీయ గణిత దినోత్సవాన్ని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మ్యాథమెటికల్ జీనియస్ శ్రీనివాస రామానుజన్ జయంతిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నామని ప్రధానోపా ధ్యాయులు అన్నారు. ఈ సందర్భంగా గణిత శాస్త్రం అభివృద్ధి, మానవాళి పెరుగుదల లో దాని ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. నిత్య జీవితంలో గణితం ప్రాముఖ్యత ను ఉపాధ్యా యులు విద్యార్థులకు వివరించారు. గణితానికి సంబంధిం చిన వ్యాసరచన పోటీలను, క్విజ్ పోటీలను నిర్వహించారు. రామాను జన్ నంబర్ 1729 విద్యార్థుల ఆకారంలో కూర్చోబెట్టారు. అనంత రం క్విజ్, వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందచేశారు.
1 thought on “బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం”