గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న నారాయణపేట కలెక్టర్
నారాయణపేట ఆగస్టు2, తెలంగాణ జ్యోతి : నీతి ఆయోగ్ నిర్వహించిన సంపూర్ణ అభియాన్ (జూలై 1 నుంచి సెప్టెంబర్ 30, 2024)లో నారాయణపేట జిల్లా నర్వ బ్లాక్ ఆరోగ్యం, పోషకాహారం, సామాజిక అభివృద్ధి (ఎస్ హెచ్ జి రివాల్వింగ్ ఫండ్) లోని 6 సూచికల్లో 5 సూచికల్లో 100 శాతం ప్రగతిని సాధించింది. ఈ విజయానికి గుర్తింపుగా నీతి ఆయోగ్ దేశ వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లకు అవార్డులు ప్రకటించగా, నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు వెండి పతకం లభించింది. శనివారం హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జి. ష్ణు దేవ్ వర్మ ఈ అవార్డును అందజేశారు. నర్వ బ్లాక్‌లో ప్రసూతి సంరక్షణ నమోదు, రక్తపోటు స్క్రీనింగ్, డయాబెటిస్ స్క్రీనింగ్, గర్భిణీలకు పోషకాహార ఆహారం అందజేత, మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ కల్పన వంటి అంశాల్లో శాతం అమలు జరగడం వల్ల ఈ గౌరవం లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ప్రిన్సిపల్ కార్యదర్శి, ప్రణాళిక సంఘం ప్రిన్సిపల్ కార్యదర్శి, సెర్ఫ్ సీఈఓలు పాల్గొన్నారు.