నాంచారమ్మ గుడికి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి
-తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకినీ
రాజు
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటా పూర్ మండలంలోని రామంజపురం గ్రామపంచాయతీ పరిధి లో గల పొలాల మధ్య ఉన్న నాంచారమ్మ గుడిని వెంటనే మరమ్మతులు చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లోకి ని రాజు అన్నారు. శనివారం వెంకటాపూర్ మండలంలోని రామంజపురంలో శిథిల వ్యవస్థలో ఉన్న శివలింగాలను పరిశీ లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 800 సంవత్స రాల క్రితం నాంచారమ్మ పంచకూటాలయాన్ని రామంజపూర్ గ్రామ పరిధిలో పొలాల మధ్య గుడిని నిర్మించారు. ఆ గుడికి రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు, రైతులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసేవారు. ఇప్పుడు ఆ గుడి అక్కడ నుండి తీసేసి శిల్పాలను ఎక్కడెక్కడ పడేశారని వెంటనే ఆశిల్పాలను తీసుకువచ్చి వెంటనే గుడిని నిర్మించాలని అన్నారు. మా ఆరాధ్య దైవమైన నాంచారమ్మ దేవాలయాన్ని ఆ ప్రాంతంలో ఎరుకల కులస్తులు అంగరంగ వైభవంగా ఎనిమిది సంవ త్స రాల నుండి జాతర నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్య క్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు కేతిరి బిక్షపతి, జయ శంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కేతిరి సుభాష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్, ములుగు జిల్లా కోశాధికారి పాలకుర్తి సురేష్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దుగాయల బాపు,రాము,కాలేశ్వరం శ్రీరాముల పోషాలు ,తదితరులు ఉన్నారు.