కాళేశ్వరాలయంలో నైమిశారణ్య పీఠాధిపతులు
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : దక్షిణ కాశీగా పేరుగాంచిన కాలేశ్వరాలయంలో నైమిశారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి స్వామి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారికి దేవస్థానం రాజగోపురం వద్ద దేవ స్థానం అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం ప లికారు. అనంతరం శ్రీ కాలేశ్వర ముక్తేదేవ శ్వర స్వామి వారికి అభిషేకము, శ్రీ పార్వతీ అమ్మవారి దర్శనం, మహా సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తదనంతరం శ్రీ పార్వతి అమ్మవారి ఆలయంలో పీఠాధిపతులు వారికి ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏ. మారుతి మరియు అర్చక స్వాములు, వేద పండితులు స్వామివారి శేష వస్త్రములు, తీర్థ ప్రసాద ములు అందించారు. ఉదయం 9:40 గంటల నుండి శ్రీ మహా కాల శివలీల విలాసం ప్రవచనములు పీఠాధిపతి భక్తులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఏ. మారుతి, సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, వేద పండితులు, అర్చక స్వాములు, గ్రామస్తులు, భక్తులు పాల్గొని స్వామివారి ప్రవచనాలను ఆలకించారు. అక్కడికి వచ్చిన భక్తులకు పీఠాధిపతులు మంగళ శాసనాలు, ప్రసాదాన్ని అందజేసారు.