ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన మునీందర్
డిప్యూటేషన్‌పై నియామకం.. సిబ్బంది సత్కారం
ములుగు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా దాసరి మునీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయనను రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కమిషనర్ హైదరాబాద్ ఉత్తర్వుల మేరకు డిప్యూటేషన్‌పై నియమించారు. సబ్ రిజిస్ట్రార్ దిలీప్ చంద్ర గోపాల్ కరీంనగర్ డిఐజి కార్యాలయానికి బదిలీ కావడంతో ఈ నియామకం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కార్యాలయ సిబ్బంది మునీందర్‌ను శాలువాతో సత్కరించి పూల బొకే అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి రిజిస్ట్రేషన్ సేవలను సమయానికి అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. వినియోగదారులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది స్రవంతి, రాజేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.






