మున్సిపల్ వైస్ చైర్మన్ ను నిలదీత
- డబుల్ బెడ్ రూమ్ బాధితులు
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉద్దేశించిన డబుల్ బెడ్ రూమ్ అర్హులకు అందలేదని, తమకు ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారని మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబును డబుల్ బెడ్ రూమ్ బాధితులు నిలదీశారు మంగళవారం జయశంకర్ భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్ రూములు రాని బాధితులు నిరసన చేపట్టారు. తమకు ఇవ్వకుండా ఇతరులకు అందించారని వారు ఆందోళన చేపట్టారు. అర్హులైన వారికి ఇవ్వడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని బాధితులు మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబును నిలదీశారు. దాంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ బాధితులు మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.