ములుగు అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే : మాజీ మంత్రి

On: February 3, 2026 8:22 PM

ములుగు అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే : మాజీ మంత్రి

ములుగు అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే : మాజీ మంత్రి

– గిరిజన యూనివర్సిటీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇచ్చిందీ కేసీఆరే

– కావాలని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు

– విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు, ఫిబ్రవరి3, తెలంగాణజ్యోతి: ములుగును జిల్లాగా, ఏటూరు నాగారం డివిజన్ గా, మూడు ప్రత్యేక మండలాలు, కలెక్టరేట్, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, ఇలా ఈ ప్రాంత అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ చొరవ తీసుకున్నారని, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీలేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం కోసం మాజీ మంత్రి దివంగత అజ్మీర చందూలాల్ కొట్లాడి సాధించారని పేర్కొన్నారు. మంగళవారం ములుగు లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీ కోసం గత ప్రభుత్వంలోనే 350ఎకరాలు కేటాయించామని, రూ.65కోట్లతో కలెక్టరేట్, రూ.250కోట్లతో మెడికల్, నర్సింగ్ కాలేజీలకు అనుమతులిచ్చా మన్నారు. మేడారం మహాజారకు కేసీఆర్ హయాంలోనే మూడు దఫాలు గా సుమారు రూ.375కోట్లకు పైగా నిధులు కేటాయించారని, ఈ ప్రభుత్వం రూ.251కోట్లు కేటాయించారని చెబుతుండగా ప్రజలు మాత్రం సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు చేస్తున్నారన్నారు. ట్రాఫిక్ జాంతో భక్తులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. వసతుల కల్పనలో విఫలమయ్యారని, ప్రభుత్వ సొమ్మును రోడ్లపాలు చేశారని విమర్శించారు. తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ ను దోషిలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ ను బలహీనపర్చలేని మాజీ మంత్రి అన్నారు. ములుగు మున్సిపాలిటీలో 20మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించు కోవాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మేడారం ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. కాగా, ములుగు మున్సిపాలిటీలో 75శాతం మంది బీసీలకు బీఫారంలు అందించినట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణ్ రావు తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పోరిక గోవింద్ నాయక్, మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, నాయకులు ముడుతనపల్లి మోహన్, ఆకుతోట చంద్రమౌళి, గండ్రకోట సుధీర్, రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!