MULUGU | విపత్తు నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం 

MULUGU | విపత్తు నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం 

MULUGU | విపత్తు నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం 

– కలెక్టర్ దివాకర 

– 970 శిథిల ఇళ్లకు నోటీసులు 

– 58 పునరావాస కేంద్రాలు సిద్ధం

– ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి 

ములుగు ప్రతినిధి, జులై 4, తెలంగాణ జ్యోతి: జిల్లాలో విపత్తుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు మొదటి హెచ్చరికతోనే అధికారులు సూచించిన ప్రకారం స్పందిస్తే ప్రాణనష్టం నివారించగలమని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 970 శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి, నివాసితులకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. ప్రమాదాల నివారణకు ప్రజలు వాగులు, లోతట్టు వంతెనలు దాటకుండా, పునరావాస కేంద్రాలకు ముందస్తుగా తరలి రావాలని సూచించారు. మొత్తం 58 పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉండగా, అందులో సుమారు 15 వేల మందికి వసతి కల్పించవచ్చని తెలిపారు. గోదావరి, జంపన్న వాగుల వల్ల ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉందని, మారేడుగొండ, కంతనపల్లి, పూరేడు చెరువులు అధిక వర్షాలకు ప్రభావిత మయ్యే అవకాశం ఉందన్నారు. 30 కీలక గ్రామాల్లో విపత్తు సేవలకై ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 100 శిక్షణ పొందిన సిబ్బంది, 6 స్పీడ్ బోట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు, “ములుగు ఫ్లడ్ అలర్ట్స్” పేరిట ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వస్తుంద న్నారు. ప్రజలకు ఇప్పటికే మూడు నెలల రేషన్ అందజేశా మన్నారు. వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని, గర్భిణీలు ముందస్తుగా ఆసుపత్రులకు వెళ్లాలన్నారు. జిల్లా ప్రజల భద్రతే ప్రాధాన్యమని, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డీపీఆర్వో ఎండీ. రఫిక్, పలు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment