Mulugu | మందు పాతర పేలుడు ఘటనలో గాయపడ్డ గిరిజనుడు మృతి
వెంకటాపురం, జూలై 11, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముకునూరుపాలెం గ్రామానికి చెందిన గిరిజనుడు సోయం కామయ్య (45) ఈ నెల 4న వెదురు కోసం కర్రెగుట్టల అటవీ ప్రాంతానికి వెళ్లగా, మావోయిస్టులు అమర్చిన ప్రషర్ బాంబుపై కాలు పడింది. పేలుడులో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కామయ్య మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.