Mulugu | డీసీసీ అధ్యక్షుడి ఎన్నికకు పారదర్శక ప్రక్రియ

Mulugu | డీసీసీ అధ్యక్షుడి ఎన్నికకు పారదర్శక ప్రక్రియ

Mulugu | డీసీసీ అధ్యక్షుడి ఎన్నికకు పారదర్శక ప్రక్రియ

– 6 నామినేషన్ల దాఖలు

– ఏఐసీసీ అబ్జర్వర్ జాన్సన్ అబ్రహాం

ములుగు ప్రతినిధి, అక్టోబర్ 14, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎన్నిక కోసం అధిష్టానం చేపట్టిన “సంఘటన్ సృజన్ అభియాన్ – తెలంగాణ” కార్యక్రమం మంగళవారం గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ అబ్జర్వర్ జాన్సన్ అబ్రహాం మాట్లాడుతూ, డీసీసీ అధ్యక్షుడి ఎన్నికను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షత వహించారు. జాన్సన్ అబ్రహాం మాట్లాడుతూ “పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి, కాంగ్రెస్ పార్టీ వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి బాధ్యతాయుతమైన పదవులు ఇవ్వనుంది” అన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. డీసీసీ ఎంపికలో ఎలాంటి లాబీయింగ్ లేకుండా పారదర్శకంగా వ్యవహరించనున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా పోటీలో నిలవవచ్చని, కానీ అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళా వర్గాలన్నిటికీ సమన్యా యం జరిగేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, బ్లాక్ మరియు అనుబంధ సంఘాల అభిప్రాయాలను సేకరిస్తామని చెప్పారు. నామినేషన్లు సమర్పించిన వారిలో ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ఇర్స వడ్ల వెంకన్న, చిడం రామ్మోహన్ రావు, సూరపనేని నాగేశ్వర్ రావు లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు సాగరికా రావు, నాగేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, బ్లాక్–మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment