Mulugu Sp | హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలి

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి

Mulugu Sp | హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలి

– జిల్లా ఎస్పీ డా.శబరిష్.పి

ములుగు ప్రతినిధి : హోలీ పండుగను సురక్షిత వాతావరణంలో బాధ్యతగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డా.శబరిష్.పి ప్రజలకు సూచించారు. హోలీని ఉదయం 6:00 గంటల నుండి 12 గంటల వరకు హోలీ పండుగ జరుపుకొని, తరువాత మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆనందంగా, ఉల్లాసంగా గడిపేలా చూసుకోవా లన్నారు. చర్మానికి, పర్యావరణానికి హాని కరం కాని సహజ రంగులను ఉపయోగించాలని, నీటి బెలూన్లు, గాజు పొడి కలిపిన రంగులు వాడరాదని, ఇతరులపై బలవంతంగా రంగులు వేయకుండా, పరస్పర గౌరవంతో పండుగను జరుపుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం చట్టవిరుద్ధమన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో 100 డయల్ చేయాలి, లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం, ప్రజలకు అసౌకర్యం, ప్రమాదం కలిగించి నట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ హోలీ ప్రేమ, ఐక్యత, మరియు సంతోషాన్ని విస్తరించేలా జరుపుకోవాలన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment