Mulugu | ఎస్సై సెల్ఫ్ షూట్
– ఆత్మహత్యకు పాల్పడ్డ వాజేడు ఎస్సై హరీష్
– వెంట గుర్తు తెలియని యువతి..?
– ములుగు జిల్లా వాజేడు మండలంలోని రిసార్ట్ లో ఘటన
– త్వరలో ఎంగేజ్మెంట్.. అంతలోనే ఆత్మహత్య
– మృతునిది భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్లపల్లె
– సంఘటనస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శబరీష్
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో ఎస్సై సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాజేడు ఎస్సైగా పనిచేస్తున్న రుద్రారపు హరీష్ (33) మండలంలోని ఓ రిసార్ట్ లో తన రివాల్వర్ తో కాల్చుకొని మృతిచెందడంతో పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఆదివారం ఏటూరునాగారంలో ఎన్కౌం టర్ జరిగి ఏడుగురు మావోయిస్టులు మృతిచెందగా ఆ విధు ల్లో పాల్గొన్న హరీష్ ఆత్మహత్యకు గల కారణాలపై చర్చ జరుగుతోంది. ఆయనతో ఆదివారం రాత్రి ఓ యువతి ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా ఆమె ఎవరనేది పోలీసు లు బయటకు చెప్పడం లేదు.
– కొద్దిరోజుల్లో ఎస్సై ఎంగేజ్మెంట్..?
వాజేడు ఎస్సైగా పనిచేస్తున్న రుద్రారపు హరీష్ సొంతూరు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్ల పల్లి. చదువుల్లో రాణించే సురేష్ కు మొదటి అటెంప్ట్ లోనే పోలీసు శాఖలో ఎస్సైగా జాబ్ వచ్చింది. హరీష్ అన్న సైతం సీఐ ఎస్ఎఫ్లో ఎస్సైగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు వ్యవసా యం చేస్తున్నారు. జాబ్ వచ్చాక హరీష్ ట్రయినీ ఎస్సైగా వాజేడులోనే విధులు నిర్వర్తించారు. తదనంతరం పేరూరు ఎస్సైగా విధులు నిర్వర్తించిన ఆయనకు ఇటీవల జరిగిన బదిలీల్లో తిరిగి వాజేడు ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం జరిగిన మావోయిస్టు ఎన్కౌంటర్ విధుల్లో సైతం పాల్గొన్న హరీష్ సోమవారం తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్ తోకాల్చుకొని మృతిచెందడం సంచలనంగా మారిం ది. రిసార్ట్ లో సంఘటన జరిగిన అనంతరం ఆయన గదిలో ఓ యువతి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ యువతి ఎవరు.? ఎందుకు ఎస్సైతో ఉన్నారు అనే విష యం తేలాల్సి ఉంది. అదేవిధంగా మృతుడు హరీష్ కు ఇటీ వల వివాహం నిశ్చయం అయ్యిందని, ఈ వారంలో నిశ్చితా ర్థం కూడా జరుగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
– సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శబరీష్
ఎస్సై హరీష్ మృతి విషయం తెలుసుకున్న ఎస్పీ శబరీష్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం సంఘ టనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సీఐ బండారి కుమార్ తో చర్చించారు. అయితే ఎస్సై హరీష్ వ్యక్తి గత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని సీఐ కుమార్ తెలిపారు. అయితే మృతదేహాన్ని ములుగు ప్రభుత్వ ఆస్ప త్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించగా ఎస్సై కుటుంబ సభ్యులు పోస్టుమార్టం చేయొద్దని నిరసనకు దిగారు. సాధారణ వ్యక్తి చనిపోతే కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని, ఒక ఎస్సై చనిపోతే గుర్తుతెలియని మహిళ ఎందుకు వచ్చా రని, ఆవీడియోలు తీయించి తమ పరువుకు భంగం కలిగిం చారని, అసలు విషయం తేలేదాకా పోస్టుమార్టం జరపొద్దని తేల్చి చెప్పారు. దీంతో పోస్టుమార్టం నిర్వహించకుండా మృత 868దేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు.