మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి

మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి

మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి

ములుగు ప్రతినిధి, జూలై9, తెలంగాణ జ్యోతి : మంత్రి సీతక్క జన్మదినం సందర్భంగా ములుగు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ రేగ కళ్యాణి బుధవారం క్యాంపు కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీతక్క ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజా ఉద్యమ నాయకురాలిగా సీతక్క పోరాటం ప్రతి మహిళకు ఆదర్శమని, ఆదివాసీ బిడ్డగా ఎదిగిన విధానం మనందరికీ ప్రేరణ అని,  కొమురం భీమ్ బాటలో ఆమె సాగించిన మార్గమే నాకు దారి అంటూ భావోద్వేగంగా తెలిపారు. నేడు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా సీతక్క ఆశీర్వాదాలు తీసుకుని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పదవిని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment