MULUGU | బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

MULUGU | బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

MULUGU | బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

– ములుగులో కాంగ్రెస్ బైక్ ర్యాలీ

– బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

– హాజరైన మాజీ ఎమ్మెల్యేలు

– అదుపులోకి తీసుకున్న పోలీసులు

– ములుగులో వేడెక్కిన రాజకీయం

ములుగు ప్రతినిధి, జులై 7, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో వివిధ పత్రికా ప్రకటనలు, సంఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల గోవిందరావుపేట మండలం చల్వాయిలో యువకుడు ప్రభుత్వంపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా ఈ అంశంపై బీఆర్ఎస్ ఆందోళనలు చేపడుతోంది. ములుగులో సోమవారం ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే పోలీసు అధికారులు జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, ర్యాలీలు , ధర్నాలు, ఇతర ఆందోళనలు నిషేదమని తెలిపారు. కానీ, బీఆర్ఎస్ నేతలు తప్పనిసరిగా ఆందోళన చేపడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ యువజన నేతలు సైతం ఛలో ములుగుకు పిలుపునివ్వడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సోమవారం ములుగులో మంత్రుల పర్యటన జరుగగా ర్యాలీలు, ఆందోళనలు నిషేదమని పోలీసులు తేల్చి చెప్పారు.

MULUGU | బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

మూడు చోట్ల బీఆర్ఎస్ ఆందోళనలు

సోమవారం ములుగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు మొదట గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి విలువలేదా అంటూ నినదించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ధర్న అనంతరం తిరిగి ప్రధాన రహదారివైపుకు వస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అదేసందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాంపు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీచేపట్టారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ప్రత్యేక వాహనాలలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని, అడిగిన వారిని అణిచివేస్తున్నారన్నారు. ఇసుక మాఫియా చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులతో కలిసి బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారన్నారు. ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు ఇచ్చినా కూడా పోలీస్ యాక్టు పెట్టి నిర్బంధాలు విధించడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడ మేనన్నారు. తమను వద్దు అని చెప్పిన పోలీసులు కాంగ్రెస్ నాయకులకు ర్యాలీకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. కాగా, మరో చోట భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ములుగులో ఇరు పార్టీల ఆందోళనల నడుమ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలను భారీగా మోహరించిన ఎస్పీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు.

MULUGU | బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment