బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ముదురుకోళ్ల బిక్షపతి
కన్నాయిగూడెం, అక్టోబర్5,తెలంగాణజ్యోతి :ములుగుజిల్లా బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన ముదురుకోళ్ల బిక్షపతి తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆదివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ బీసీ సమాజ అభ్యున్నతి, హక్కుల సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తాను. నాపై నమ్మకంతో ఈ పదవి అప్పగించిన నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లం దుర్గారావు, రాష్ట్ర కోశాధికారి పసుపులేటి కరుణాకర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.