విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మోటార్ సైకిల్ దగ్ధం
వెంకటాపురం, జులై 26, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ఏడు చర్లపల్లి, కొత్తూరు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక మోటార్ సైకిల్ పూర్తిగా దగ్ధమైంది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన అతను తిరిగి వచ్చి తన ఇంటి పాకలో మోటార్ సైకిల్‌ను పార్క్ చేసిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించి పెట్రోల్ ట్యాంక్ వద్ద చెలరేగడంతో మోటార్ సైకిల్ పూర్తిగా దగ్ధమైంది. మంటలు చుట్టుపక్కల వారికి ఆందోళన కలిగించాయి. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ ఆర్థిక నష్టం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.