మాక్ డ్రీల్, బాష్పవాయు ప్రయోగంను నిర్వహించిన పోలీసు బలగాలు
మహబూబాబాద్, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మాక్ డ్రిల్ లో భాగంగా వజ్ర వాహనంతో గురువారం టియర్ స్మోక్ గ్యాస్, గ్రెనేడ్ లను మహబూబాబాద్ జిల్లాలో సాయుధ పోలీస్ అధికా రులు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు, గొడవలు, ప్రజలను ఇబ్బంది పెట్టేలా ధర్నాలు చేసినపుడు శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీస్ వారు ఎలాంటి విధులు నిర్వహించి వారిని ఎలా అదుపులో పెట్టాలి, గుంపును ఎలా చెదర గొట్టాలి అనే అంశాలపై మాక్ డ్రిల్, మాబ్ ఆపరేషన్ డ్రిల్ల్ నిర్వహిం చామన్నారు.మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు సాయుధ అధికారులచే మహబూబా బాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో కొత్త పరెడ్ గ్రౌండ్ లొ వజ్ర వాహనంతో టియర్ స్మోక్ గ్యాస్ ను ప్రయోగించారు. ఈ సంద ర్భంగాఎస్పీ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో అందరూ ప్రజలు కలిసి మెలసి జీవిస్తారన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ లో భాగంగా ఇలాంటి డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డిఎస్పీలు శ్రీనివాస్,విజయ్ ప్రతాప్,ఆర్.ఐలు అనిల్, సోములు, బెల్ అఫ్ అర్మ్ సిబ్బంది పాల్గొన్నారు.