మృత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తనయుడు సూర్య
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రానికి చెందిన ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి నానమ్మ కమలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. కాగా, శుక్రవారం నిర్వహించిన దశదిన కర్మకి మంత్రి సీతక్క తనయుడు సూర్య హాజరై మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమలమ్మ మృతికి గల కార ణాలను ఆయన అడిగి తెలుసు కున్నారు.ఈ కార్యక్ర మంలో సూర్య వెంట కాంగ్రెస్ ములుగు మండల అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా, మేడారం ట్రస్టు బోర్డు డైరెక్టర్ మిల్కూరి ఐలయ్య ,వెంకటాపూర్ ఎంపీటీసీ జంగిలి శ్రీలత రవి, సీనియర్ నాయకులు రావుల రాజేశ్వరరావు ,నేపాల్ రావు, లక్కీ అనిల్, చక్రపు రాజు, ఎనబోతుల రఘు, బుస గణేష్, తదితరులు పాల్గొన్నారు.