భూపాలపల్లి జిల్లాలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు
కాటారం, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ఐటీ పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాటారం మహాదేవపూర్, మలహర్రావు, మహాముత్తారం, భూపాలపల్లి మండలాల్లో బాణసంచా పేల్చారు. కాటారం లో 56 కిలోల కేక్ కట్ చేశారు. కేక్ ను, పండ్లు, స్వీట్స్ ప్రజలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,సీనియర్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు,మహిళ కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.