ఐటీఐ కళాశాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: మండల కేంద్రంలో నిర్మించనున్న ఐటీఐ కళాశాల నిర్మాణ స్థలాన్ని గురువారం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిజి ఐఐసి) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ నిర్మాణ ప్రణాళికలు, మౌలిక సదుపాయాల అమలు పద్ధతులు మరియు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచు కుని కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. కాలేజీ నిర్మాణం పటిష్టంగా, నాణ్యత ప్రమాణాలతో విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలు, శిక్షణ, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రణా ళికలు రూపొందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్ర మంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.