వెంకటాపురం మండలంలో శుక్రవారం మంత్రి సీతక్క పర్యటన

On: April 9, 2026 8:27 PM

వెంకటాపురం మండలంలో శుక్రవారం మంత్రి సీతక్క పర్యటన

వెంకటాపురం మండలంలో శుక్రవారం మంత్రి సీతక్క పర్యటన

వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 9 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటించనున్నట్లు రెవెన్యూ అధికారులు టూర్ ప్రోగ్రాం విడుదల చేశారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. మంత్రి సీతక్కతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ముత్తారంలో కల్వర్టు ప్రారంభం, 3 గంటలకు వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా దర్బార్, 4 గంటలకు ఆర్ & బి గెస్ట్ హౌస్ నుంచి పాత మార్కెట్ సెంటర్ వరకు సీసీ రోడ్డు ప్రారంభం, 4.15 గంటలకు మల్లాపూరం మార్గంలో కంకలవాగుపై వంతెన ప్రారంభం, సాయంత్రం 5.30 గంటలకు మోట్లగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు, అనంతరం 6 గంటలకు గిరిజనులతో సహపంక్తి భోజన కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. పర్యటన నేపథ్యంలో సంబంధిత గ్రామాల్లో అధికారులు శిలాఫలకాలు ఏర్పాటు చేసి, తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!