రామాలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి సీతక్క
ములుగు, తెలంగాణజ్యోతి: జిల్లా కేంద్రములోని రామాలయ ప్రాంగణములో రూ. 10 లక్షలతో ఆలయ అభివృద్ధికి రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని,రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని పనులు చేపట్టే విధంగా కృషి చేస్తానని ములుగు నియోజక వర్గంలోని అన్ని గుడులకు నిధులు కేటాయించి అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, ఆలయ కమిటీ అధ్యక్షులు దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి, కోశాధికారి ఆవుల ప్రశాంత్ రెడ్డి, సభ్యులు గట్ల శ్రీనివాస్ రెడ్డి, చింతలపూడి భాస్కర్ రెడ్డి, సానికొమ్ము రమణారెడ్డి, దొంతి రెడ్డి బలరాం రెడ్డి, వెంకట్ రెడ్డి, స్వాములు బానాల రాజకుమార్, ఒజ్జల కుమార్, శ్రీను యాదవ్, దేవి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మ రామకృష్ణ లతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు