Minister Seetakka | పేదవారి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
– మొట్లగూడెంలో ప్లేట్ తయారీ యూనిట్ ప్రారంభం
ములుగు ప్రతినిధి, జూలై 11, తెలంగాణ జ్యోతి : ప్రతి నిరుపేద ఇంటి యజమానిగా మారేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల భూమిపూజ మరియు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చంద్ర పాల్గొన్నారు. “ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో గృహ నిర్మాణానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబాన్ని ఇంటి యజమానిగా చూడడం ప్రభుత్వ లక్ష్యం,” అని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎంపీడీఓ రామకృష్ణ, కాలనీ వాసులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
– మొట్లగూడెంలో ప్లేట్ తయారీ యూనిట్ ప్రారంభం
గోవిందరావుపేట మండలంలోని మొట్లగూడెంలో ఆదివాసీ మహిళలకు ఉపాధి కల్పన దిశగా ఏర్పాటు చేసిన ప్లేట్ తయారీ యూనిట్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇది సమ్మక్క సారలమ్మ అడవి ఆదివాసి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో, రాండ్స్టాడ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ మరియు సయోధ్య హోమ్ ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, రేగ కళ్యాణి, రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం వనమహోత్సవం లో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎఫ్‌డిఓ రమేష్, ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రహమాన్, రాండ్స్టాడ్ సంస్థ ప్రతినిధులు అక్యూల్, స్వాప్న విట్టల్, శైల దాసికా, స్మిత కదారి, వంశీ కృష్ణ, వినయ్ వంగళ తదితరులు పాల్గొన్నారు.