కేజీబీవీ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలి
– ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం, మినిమం టైమ్ స్కేల్ వర్తింపచేయాలని కేజీబీవీ యూనియన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు చల్ల సునీత, యూనియన్ సభ్యులు విజయ, రాజేశ్వరి, నళిని, కవిత తదితరులు గురువారం నాడు కాటారం మండలంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఉద్యోగులు తెలిపారు.