యోగాతో మానసిక ఒత్తిడి, ఆరోగ్య పరిరక్షణ
– అమరావతి విద్యాలయం ప్రధానోపాధ్యాయులు వీరగని రాజయ్య
తెలంగాణ జ్యోతి, ములుగు : యోగాతో మానసిక ఒత్తిడి ఆరోగ్య పరిరక్షణ ఎంతో దోహదపడుతుందని అమరావతి విద్యాలయం ప్రధానోపాధ్యాయులు వీరగాని రాజయ్య అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పేట అమరావతి విద్యాలయంలో విద్యార్థులచే ఉదయం యోగ నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు వీరగాని రాజయ్య యోగాలో పాల్గొన్న వారికి ,యోగా వల్ల కలిగే ప్రయోజనాలను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ వ్యాయామం అనంతరం యోగాను ప్రతిరోజు 30,నుండి 40 నిమిషాలు పాటు నిర్వహిస్తే, మానసిక ఒత్తిడి తట్టుకొని, సంపూర్ణ శక్తివంతులు అవుతారని, సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని యోగా యొక్క ప్రయోజనాలను విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మూల రాజయ్య, వీరగని ఆనందం ,అంతటి సుమలత, ఉపాధ్యాయులు జేరిపోతుల కిరణ్ ,వైనాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.