మూడు రోజులపాటు మీసేవ సర్వీసులు బంద్
– సర్వర్ అప్డేట్ తో ఈనెల 3 నుంచి 5వరకు సేవల నిలిపివేత
ములుగు ప్రతినిధి, ఏప్రిల్1, తెలంగాణ జ్యోతి : జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాలు, అప్లికేషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు గాను మీసేవా కేంద్రాలను సందర్శించే ప్రజలు ఈనెల 3వతేదీ నుంచి 5వ తేదీ వరకు కేంద్రాలకు రావొద్దని మీసేవా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొమురవెల్లి సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వర్ అప్డేట్ లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. ఈనెల 1నుంచి మీసేవా సర్వీసుల చార్జీలు పెరిగాయని తెలిపారు. గత పదేళ్లుగా అన్ని రంగాల్లో ధరలు పెరిగినా మీసేవ విభాగంలో మాత్రం ఎలాంటి దరలు పెంచలేదని గుర్తు చేశారు. ఈ అసౌకర్యానికి ఇబ్బంది పడకుండా ఈనెల 6 నుంచి తిరిగి కేంద్రాలకు రావాలని సూచించారు.









