జంపన్న వాగు దాటి మల్యాల గ్రామంలో వైద్య శిబిరం

జంపన్న వాగు దాటి మల్యాల గ్రామంలో వైద్య శిబిరం

జంపన్న వాగు దాటి మల్యాల గ్రామంలో వైద్య శిబిరం

ఏటూరునాగారం, జూలై25, తెలంగాణజ్యోతి: మండలంలోని దొడ్ల–కొండాయి గ్రామాల మధ్య వంతెన తెగిపోవడంతో ఆరోగ్య సౌకర్యాల కొరత ఏర్పడగా వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారి డాక్టర్ హెచ్.ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలో మల్యాల గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పడవ ద్వారా జంపన్న వాగు దాటి అక్కడి నుండి కాలినడకన మల్యాల, కొండాయి గ్రామాలకు చేరుకుని 45 మందిని పరీక్షించి, అవస రమైన మందులు పంపిణీ చేశారు. నలుగురికి మలేరియా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రిపోర్టులు వచ్చినట్లు తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సంబంధిత సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా దోమల నివారణకు దోమతెరలు వాడాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ భాస్కరరావు, స్కూల్ హెచ్‌.ఎం. శేషయ్య, ఆశావర్కర్లు జ్యోతిలక్ష్మి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment