కొండాయి గ్రామంలో వైద్య శిబిరం
తెలంగాణజ్యోతి, సెప్టెంబర్3, ఏటూరునాగారం : మండలం లోని కొండాయి గ్రామంలో డాక్టర్ హెచ్. ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం భాగంగా ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే చేపట్టారు. గ్రామంలో జ్వరం బారిన పడిన 30 మంది రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వేడి చేసి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సమ్మక్క, ఆశ కార్యకర్తలు లక్ష్మి, సునీత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.