గిరిజన విద్యార్థులకు వైద్య శిబిరం 

On: March 25, 2026 5:04 PM

గిరిజన విద్యార్థులకు వైద్య శిబిరం 

గిరిజన విద్యార్థులకు వైద్య శిబిరం 

 సిపిఆర్ పై అవగాహన 

కన్నాయిగూడెం, మార్చి 25, తెలంగాణ జ్యోతి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్ బి ఎస్ కే ఏటూరునాగారం ప్రత్యేక వైద్య బృందం డాక్టర్ నరహరి నేతృత్వంలో కన్నాయిగూడెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ పోషకాహారం, రక్తహీనత, దంత, కంటి మరియు చర్మ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు, అదేవిధంగా పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రవితేజ CPR పై ప్రయోగిక శిక్షణ అందించి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే విధానాలను వివరించారు, మానసిక ఆరోగ్యంపై కూడా వైద్య బృందం అవగాహన కల్పిస్తూ ఎవరైనా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ట్లయితే టెలి మానస్ హెల్ప్‌లైన్ 14416ను సంప్రదించాలని సూచించారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రహశ, డాక్టర్ హర్ష, డాక్టర్ శ్రీసాయి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ నిఖిత, డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ కిషన్, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ సారంగపాణి, ఏఎన్ఎం రజని, ఫార్మసిస్ట్ భాస్కర్, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు అజ్మీర యుగేందర్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అశ్విని, చందర్ సింగ్, క్రిష్ణ, నరేష్, అనిల్, ఏఎన్ఎం కల్పన, గంగరాజు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగా విద్యార్థుల్లో ఆరోగ్యంపై చైతన్యం పెరిగిందని పాఠశాల సిబ్బంది తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!