MEDARAM | సమ్మక్క సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు

సమ్మక్క సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు

MEDARAM | సమ్మక్క సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు

ములుగు ప్రతినిధి, జులై 2, తెలంగాణ జ్యోతి :  మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర తేదీలను మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు బుధవారం ప్రకటించారు. 2026లో జరగనున్న ఈ మహా జాతర జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనుంది. జాతర జనవరి 28 (బుధవారము): సాయంత్రం 6 గంటలకు శ్రీ సారలమ్మ అమ్మవారు గద్దెకు విచ్చేయనున్నారు. అదే రోజు శ్రీ గోవిందరాజు మరియు పగిడిద్ద రాజులు గద్దెలకు చేరుకుంటారు.

📅 జనవరి 29 (గురువారము): సాయంత్రం 6 గంటలకు శ్రీ సమ్మక్క అమ్మవారు గద్దెకు ఆహ్వానితులవుతారు.

📅 జనవరి 30: భక్తులు పెద్దఎత్తున హాజరై మ్రొక్కుబడులు సమర్పించుకునే రోజు.

📅 జనవరి 31 (శనివారము): సాయంత్రం 6 గంటలకు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లు, గోవిందరాజు, పగిడిద్ద రాజులు వనప్రవేశం చేస్తారు.

ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు లక్షలాది భక్తులు హాజరై తల్లి దర్శనానికి మ్రొక్కులు చెల్లిస్తారు. 2026 మహా జాతర కోసం ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేస్తోంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment