Medaram | మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు. 

Written by telangana jyothi

Published on:

Medaram | మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు. 

– గిరిజన సంక్షేమ శాఖలో సమీక్షించిన మంత్రి సీతక్క

 హైదరాబాద్, తెలంగాణ జ్యోతి : 2024 ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సోమవారం ఉన్నతా ధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈ మేరకు ఆదేశాలిచ్చా రు. జాతరలో పారిశుధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీటి లభ్యత, స్నానఘట్టాల ఏర్పాట్లు, భక్తుల వసతులు, తదితర అంశాలవారీగా సంబంధిత అధికారులతో చర్చించి తగు ఆదేశా లిచ్చారు. ఇంతకు ముందు జరిగిన కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈ సారి జాతర సమయంలోనే జరిగేటట్లు చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపి మేడారం జాతరకు జాతీయ పండుగ హెూదా కోసం కృషి చేద్దామని, తద్వారా రాష్ట్ర బడ్జెట్ కు కేంద్ర నిధులు తోడై జాతరను మరింత ఘనంగా నిర్వ హించుకుందామని అన్నారు. వచ్చే వారం ఏటూరునాగారం లోని ఐటీడీఏ అధికారులు అందరితో సమీక్ష నిర్వహించి జాతర పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ తన తల్లివంటిదని, ఈ శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి తమ సమస్యలను ఎప్పుడైనా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా ట్రైబల్ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా,
ఏటూరునాగారం ఐటిడిఎ పిఓ అంకిత్, విట్టా సర్వేశ్వర్ రెడ్డిసహాయ కార్యదర్శి సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శంకర్, ట్రైకార్ జీఎం శంకర్, ఐటిడిఎ ఈ ఈ హేమలత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “Medaram | మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు. ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now