సొంతగూటికి చేరిన మత్తె రాజు
ఆత్మకూరు, అక్టోబర్ 10, తెలంగాణ జ్యోతి : ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామపంచాయతీలో రాజకీయ చేరికల అంశం చర్చనీయాంశం గా మారింది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితో సేవలందిస్తున్న మత్తె రాజు ఇటీవల బీఆర్ఎస్ నాయకుల చేత గులాబీ కండువా కప్పించుకుని ఆ పార్టీలో చేరారు. అయితే పార్టీ మారినప్పటికీ మనసు మాత్రం మారలేదన్నట్లు, కాంగ్రెస్ పట్ల ఉన్న తన ఆరాధనను దాచలేక చివరికి తిరిగి హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలం కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ గఫర్, గ్రామ పార్టీ అధ్యక్షులు కీర్తి లక్ష్మణ్, సీనియర్ నాయకులు ఐ. రాజన్న, ఎంపీటీసీ అభ్యర్థి ఉన్నల ప్రశాంత్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మత్తె రాజుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, దినేష్ అనే ఇద్దరు యువకులు కూడా కాంగ్రెస్ గూటిలో చేరారు. ఉపాధ్యక్షులు సతీష్, ఓన్నాల సాంబయ్య, అజ్మీర రాజు, సాదిక్, అజారుద్దీన్, రమేష్, ప్రకాశ్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.